- 100 మత్స్య కార కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరికప్రకాశం: వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకారులకు మంచిరోజులు వస్తాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి భరోసా కల్పించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై వంద మత్స్యకార కుటుంబాలు ఐవీ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఐవీ రెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ 90 పైసలకే ఇచ్చి ఆదుకున్నారన్నారని గుర్తు చేశారు. ఇవాళ చంద్రబాబు పాలనలో యూనిట్ రూ.3.86 ఉందన్నారు. ఏడాదిలో ఎన్నికలున్నాయని చంద్రబాబుకు ఇప్పుడే ఆక్వా రంగం గుర్తుకొస్తుందని మండిపడ్డారు. ఆక్వా రంగానికి సంబంధించిన ఐస్ ఫ్యాక్టరీలు, ప్రోసెసింగ్ యూనిట్లకు ఇప్పుడు కరెంట్ యూనిట్ ధర రూ.7 ఉంది. రేపు మన ప్రభుత్వంలో దాన్ని రూ. 5కు తగ్గిస్తారని చెప్పారు. ఆక్వా సీడ్ దగ్గర నుంచి దాణా వరకూ నాణ్యత ఉండేలా చర్యలు తీసుకుంటారన్నారు. దళారీ వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతారని చెప్పారు. సముద్ర తీరంలో మూడేళ్లలో ఉత్పత్తికి తగినట్టుగా కోల్డ్ స్టోరేజీలు, ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టిస్తాం. నాల్గవ ఏట మద్దతు ధర ప్రకటిస్తారని వివరించారు.
45 ఏళ్లకే పింఛన్వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తారని ఐవీ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలకు ఆకర్శితులై అర్ధవీడు మండలం మొహిద్దినపురం గ్రామంలోని 100 మత్స్య కార కుటుంబాలు అర్ధవీడు మండల సేవదాల్ అద్యక్షుడు వేలుపుల దిబ్బయ్య , గ్రామ అధ్యక్షుడు కందుల రామకృష్ణ రెడ్డి, ప్రదాన కార్యదర్శి పోతిరెడ్డి, బూత్ కన్వీనర్ ఎస్‌కే అల్లా బకాష్, సిహెచ్ రమణ రెడ్డి, బి శ్రీనివాస్ సింగ్ ఆధ్వర్యంలో మత్స్య కార కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరాయన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ సి హెచ్ రంగారెడ్డి, గిద్దలూరు మండల కన్వీనర్ చెక్కర బలనాగి రెడ్డి, గిద్దలూరు మండల వాణిజ్యం విభాగం అధ్యక్షుడు బాలిరెడ్డి రమణా రెడ్డి, జిల్లా బిసి సెల్ ప్రదాన కార్యదర్శి కమలపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి శీలం బాల అంకి రెడ్డి, గిద్దలూరు మండల యూత్ వింగ్ అధ్యక్షుడు పల్లా ప్రతాప్ రెడ్డి, హనుమంతారెడ్డి, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.