ఒక్క అవకాశం ఇవ్వండి


గుంటూరు: వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుల శివకుమార్‌ కోరారు. శనివారం తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం మడమ తిప్పకుండా పోరాడుతున్న వైయస్‌ జగన్‌కు మనందరం సెల్యూట్‌ చేయాలన్నారు. గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని విస్మరించిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి దగ్గరగా ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.60 కోట్లు విలువ చేసే 12 ఎకరాలు స్థలాన్ని కబ్జా చేశారన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా సాగుతుందన్నారు. చంద్రబాబు, తన ఎమ్మెల్యేలు నీతి కబుర్లు చెబుతూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేపై 8 కేసులున్నాయని ఆయనే ఒప్పుకున్నారన్నారు. కబ్జాలు, ఆక్రమణ కేసులు ఉన్న తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి ప్రసాద్, మరో మంత్రి విజయవాడలోని శాతవాహన కాలేజీని దోచుకునేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు. తెనాలి నియోజకవర్గంలో పోలీసు రాజ్యం సాగుతుందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను అణచాలని చూస్తే మీ అబ్బ తరం కాదని హెచ్చరించారు. గల్లా జయదేవ్‌ నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని నిలదీశారు. నేను లోకల్‌..వైయస్‌ఆర్‌సీపీ జెండాను తప్పకుండా ఎగురవేస్తామని చాలెంజ్‌ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ వైయస్‌ జగన్‌ తీసుకువస్తారన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తారని, ఒక్కసారి వైయస్‌ఆర్‌సీపీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
 
Back to Top