గూడూరులో తిరుగులేని శక్తిగా వైయస్‌ఆర్‌సీపీ

నెల్లూరు: జిల్లాలోని గూడూరులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. చిట్టమూరులో పార్టీ బలోపేతానికి సన్నారెడ్డి  శ్రీనివాసులు రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. . మండల పరిధిలోని మల్లాం గ్రామంలో  బుధవారం మండల పార్టీ సమావేశం నిర్వహించారు. నియోజక ఇన్‌చార్జి మేరిగ మురళీధర్‌ మండలంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు.   ఈ సంధర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి‌ రెడ్డి మాట్లాడుతూ ప్రాజాప్రతినిధులు పార్టీ మారినా ప్రజలు మాత్రంవైయస్‌ఆర్‌ సీపీ వెంటే ఉన్నారన్నారు. ఈ జనం చూస్తే చిట్టమూరు   ఆదర్శంగా తీసుకుని మిగిలన మండలాలు పని చేయాలని సూచించారు. సీఈసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో మూడు పంటలు పండే పొలాలను చంద్రబాబు రైతుల వద్ద నుంచి అన్యాయంగా లాక్కున్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ అన్ని మండలాల్లోని నాయకులను కలుపుకుని ముందుకు సాగుతూ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సేంక్షేమ పథకాలు టీడీపీ కార్యకర్తలకు తప్ప పేద ప్రజలకు అందకపోవడంతో ప్రజలు చంద్రబాబుకు శాపనార్దాలు పెడుతున్నారన్నారు.

Back to Top