మంచితనానికి మారుపేరు వైయస్సార్సీపీ

హైదరాబాద్‌: నా ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని పార్టీ సీనియర్‌ నేత నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏడవ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీలో మోసపోయిన వచ్చిన నన్ను వైయస్‌ జగన్‌ తల్లిలా ఆదరించి పార్టీలో సముశ్చిత స్థానం కల్పించారన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నేడు వైయస్‌ఆర్‌ సీపీ తిరుగులేని ప్రతిపక్షంగా నిలబడిందన్నారు. మంచితనానికి మారుపేరైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ.. అవినీతి, అడ్డదారి రాజకీయాలకు నిలయమైన తెలుగుదేశం పార్టీ ఎక్కడ అనేది ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు అవినీతి విధానాలను ఆయన కొడుకు లోకేష్‌కు వారసత్వంగా ఇచ్చి రాజకీయాలనే భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ పార్టీ అధ్యక్షుడైనా ఆ పార్టీ ఆదర్శాలను, సిద్ధాంతాలను వారసత్వంగా ఇస్తారు కానీ చంద్రబాబు అవినీతిని మాత్రమే తన కొడుకు లోకేష్‌కు వారసత్వంగా ఇచ్చి ఎమ్మెల్సీగా అడ్డదారిన తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ను ఎవరూ ఆపలేరనేది సత్యమని స్పష్టం చేశారు. 

Back to Top