వైయ‌స్సార్సీపీ విస్త్ర‌త స్థాయి స‌మావేశం షెడ్యూల్‌

విజ‌య‌వాడ‌) వైయ‌స్సార్సీపీ విస్త్ర‌త‌స్థాయి స‌మావేశం కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయ‌కులు ఇప్ప‌టికే అక్క‌డ‌కు చేరుకొన్నారు. ఉద‌యం 8గంట‌ల నుంచి నాయ‌కుల రిజిస్ట్రేష‌న్ మొద‌ల‌వుతుంది. అనంత‌రం అక్క‌డ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స‌మావేశం జ‌రుగుతుంది. ఉద‌యం 9.30 ని. ల నుంచి గంట పాటు పార్టీ ముఖ్య నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ సమావేశం అవుతారు. అనంత‌రం 10.30ని. ల‌కు విస్త్ర‌త స్తాయి స‌మావేశం జ‌రుగుతుంది. పార్టీ అనుస‌రిస్తున్న పోరాట మార్గాల మీద చ‌ర్చ నిర్వ‌హిస్తారు. అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య ఉప‌న్యాసం చేస్తారు. 
Back to Top