పాదయాత్ర పవిత్ర లక్ష్యంతో సాగుతోంది

వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ను మించిన పాలన అందిస్తారు
2014లో చంద్రబాబు దుష్టపాలనను వైయస్‌ఆర్‌ అంతమొందించారు
రాబోయే ఎన్నికల్లో మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది
టీడీపీ చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి
24న కొత్తవలసలో 3 వేల కి.మీ మైలురాయి దాటనున్న వైయస్‌ జగన్‌
పైలాన్, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
విశాఖపట్నం: ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించాలనే పవిత్ర లక్ష్యంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ఏ రకంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని అందిచారో.. అంతుకు మించిన పరిపాలన వైయస్‌ జగన్‌ అందిస్తారన్నారు. విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తలశిల రఘురాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసిన వైయస్‌ఆర్‌ 2014లో చంద్రబాబు దుష్టపాలనను అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం కాబోతుందని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ దేశ చరిత్రలో ఏ నాయకుడికి రాలేదన్నారు. ఏ జిల్లాలో కూడా ప్రజాదరణ తగ్గకుండా ఊర్లకు ఊర్లు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నామన్నారు. ప్రజల కోసం తప్పించే నాయకుడు ఎవరూ లేరు.. ఇక రారూ అని రఘురాం అన్నారు. 

చంద్రబాబు పాలనతో ప్రజలంతా విసుగెత్తిపోయారన్నారు. పాదయాత్రలో ప్రజలంతా అనేక సమస్యలపై వినతులు ఇచ్చారని, వాటికి పరిష్కారాలు చెప్పడం.. ప్రభుత్వం వచ్చిన తరువాత ఎలాంటి మేలు చేస్తామో వివరిస్తున్నారన్నారు. వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేక, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరికీ భరోసా కల్పిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ మేలు చేస్తామని పాదయాత్ర సాగుతున్న తీరు అద్భుతమన్నారు. 

ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పూర్తయినప్పుడు తెలుగుదేశం పరిపాలనకు అంకురార్పన జరిగిందని భావించామన్నారు. అదే విధంగా ఏలూరులో రెండు వేల కిలోమీటర్లు పూర్తయినప్పుడు టీడీపీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలంతా భావించారన్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న పాదయాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ప్రారంభంలోనే మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటుతుందని, ప్రజలంతా మంచి ప్రభుత్వం రాబోతుందని ఆశతో ఉన్నారన్నారు. 

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం గ్రామంలో 24న మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోనుందని తలశిల రఘురాం చెప్పారు. పాదయాత్ర మూడు వేల పూర్తి సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జిల్లా నాయకులు పైలాన్‌ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. అదే విధంగా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్రను అనేక రకాలుగా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించినా కార్యకర్తలంతా శాంతియుతంగా విజయవంతం చేసేందుకు కృషి చేశారని, వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర సాగిన దారెంబడి టీడీపీ నేతలు పసుపు నీరు చల్లితే.. ప్రజలంతా టీడీపీ నేతలు చేసే అవినీతికి కల్లాపి చల్లి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 
Back to Top