పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు త‌గ‌వు

క‌ర్నూలు(హాలహర్వి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి పదవులు ఇవ్వడం తగదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గసభ్యులు కోనంకి జనార్దన్‌నాయుడు, ఎంపీపీ బసప్పలు అన్నారు. బుధవారం హాలహర్విలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు వైయ‌స్ఆర్‌సీపీ తరుపున గెలుపొంది టీడీపీ పార్టీలోకి తమ స్వలాభం కోసం వెళ్లార‌న్నారు. అలాంటి వారికి సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి తిరిగి గెలిచిన తర్వాతే వారికి మంత్రి పదవులు ఇవ్వాలని వారు సూచించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందన్నారు. ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఆశ చూపించి తమవైపు తిప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించి, పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. హాలహర్వి మండలంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు కల్యాణ్‌గౌడ్, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, మండల కో–కన్వీనర్‌ అర్జున్, హనుమంతరెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యులు శ్రీనివాసులు, చింతకుంట సొసైటీ డైరెక్టర్‌ చెన్నయ్య, లింగప్ప, ఎర్రిస్వామి, నెట్టెప్ప తదితరులు పాల్గొన్నారు.

Back to Top