ఇంటింటికీ న‌వ‌ర‌త్నాలు  విశాఖపట్నం:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల వంటి ప‌థ‌కాల‌ను ఇంటింటికీ తీసుకెళ్లాల‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  విశాఖ తూర్పు నియోజకవర్గంలోని విశాఖ ఫంక్షన్‌ హాలులో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ల సమావేశం కొద్ది సేప‌టి క్రిత‌మే ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల బ్రోచ‌ర్‌ను విడుద‌ల చేశారు. అనంత‌రం ఆయ‌న న‌వ‌ర‌త్నాల గురించి వివ‌రిస్తూ..ప్ర‌జ‌ల్లోకి ఈ ప‌థ‌కాల‌ను విస్తృతంగా తీసుకెళ్లాల‌ని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని పార్టీ కో-ఆర్డినేట‌ర్ల‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, 175 అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు.
Back to Top