బీసీ సబ్‌ ప్లాన్‌ ఏమైంది బాబూ..?


– చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నారు.
– చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. 
– ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు
 – బీసీలకు ఇచ్చిన 110 వాగ్ధానాల్లో ఒక్కటైనా అమలు చేశావా?
– బీసీ నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
విజయవాడ: చంద్రబాబు ఎన్నికలకు ముందు బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తామని ఓట్లు వేయించుకొని మోసం చేశారని, బీసీ సబ్‌ ప్లాన్‌ ఏమైందని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. బీసీల వ్యతిరేకి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. విజయవాడలో శనివారం వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అవినీతి, అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారో, వ్యవస్థలను నిర్యీర్యం చేశారన్నారు. ఆర్భాటాలతో ఎంతో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు విధానాలు ఐదు కోట్ల ప్రజలకు తెలుసు అని హెచ్చరించారు. ఏడాది ముందే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు నిలువు దోపిడీ చేశారని ఆరోపించారు. మైనింగ్, ఇసుక, మట్టి మాఫియాతో ప్రజా సంపదను దోచుకుంటన్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో విచారణ జరిగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయంతో ముందస్తుగా చంద్రబాబు కూటమి పేరుతో డ్రామాలాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు అన్యాయం జరిగినప్పుడే, కేసులు బయటకు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తున్నారని తెలిపారు. ఐదు కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, తనకు అన్యాయం జరిగితే అందరూ రక్షణగా ఉండాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎందుకు ఎన్నికల సమయంలో మాత్రమే ఇలాంటి కుట్రలు చేస్తున్నావని ప్రశ్నించారు. బీసీల బతుకులు మార్చేందుకు, జీవన విధానం మార్చేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించిందా అన్నారు. ఆదరణ–2 అన్నది ప్రచార ఆర్భాటమే తప్ప ఏ ఒక్కరికి మేలు జరగడం లేదు అన్నారు. గతంలో ఇచ్చిన ఇస్తీ్ర పెట్టెలు, మంగళి కత్తులు ఇస్తున్నారన్నారు. ఏమాత్రం బీసీలపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. బీసీలకు బడ్జెట్‌లో ఎందకు నిధులు కేటాయించలేదని, ఇంతవరకు బీసీ సబ్‌ ప్లాన్‌పై ఊసే లేదన్నారు. బీసీ మంత్రులు కూడా ఈ అంశంపై మాట్లాడటం లేదన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన 110 హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కులాల మధ్య తగాద పెట్టిన పరిస్థితి ఈ నాలుగేళ్ల టీడీపీ పాలనలో చూస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాల ఖర్చు అంతా కూడా శ్రామికవర్గాల చెమట చుక్క అన్నది మర్చిపోవద్దు అన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేస్తున్నావో సమాధానం చెప్పాలన్నారు. బీసీ సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టావని ప్రశ్నించారు. లక్షల కోట్లు బినామీల పేరుతో కాజేశారని విమర్శించారు. నీ బినామీలపై ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారన్నారు. ఆదరణ పేరుతో ఇచ్చే పనిముట్లు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వీటన్నింటిపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.  లేదంటే బీసీ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు బీసీలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
Back to Top