వైయస్‌ జగన్‌తోనే బీసీలకు న్యాయం


వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నమ్మిన వారిని నట్టేటా ముంచే నైజం చంద్రబాబుదని, నమ్మిన వారిని ఆదుకునే నైజం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానిదని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. బీసీలను ఎన్నికల్లో వాడుకొని అన్ని విధాల చంద్రబాబు ముంచారని మండిపడ్డారు. త్వరలోనే బీసీ అధ్యయన కమిటీ నివేదికను వైయస్‌జగన్‌కు అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర తరువాత బీసీ గర్జన చేపడుతున్నట్లు వెల్లడించారు.

 
Back to Top