బక్రీదు వేడుకల్లో వైయస్సార్సీపీ నేతలు

నరసరావుపేటః  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు, కార్యకర్తలు బక్రీదు పండుగను ఘనంగా జరుపుకున్నారు. నరసారావు పేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసి మిఠాయిలు తినిపించి  ఆనందాన్ని పంచుకున్నారు. నెల్లూరులో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు ముస్లిం సోదరులతో కలిసి బక్రీదు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు  వైయస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. త్యాగానికి మారు పేరుయినటువంటి బక్రీదు సంధర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తి శ్రధ్ధలతో ప్రార్ధనలు చేస్తారని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. 

Back to Top