దాడికి వైఎస్సార్‌సీపీ ఖండన

 హైదరాబాద్) విధి నిర్వహణలో ఉన్న మహిళా తహశీల్దార్
పై టీడీపీ ఎమ్మెల్యే, ఆయన గూండాల దాడిని వైఎస్సార్‌సీపీ ఖండిస్తోందని పార్టీ అధికార
ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. వెంటనే చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక మహిళా అధికారిపై దాడి చేస్తే ఎందుకు పట్టించుకోవటం లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రశ్నించిన అధికారులపై టీడీపీ ఎదురు కేసులు పెడుతోందని ఆరోపించారు. 

Back to Top