నెల్లూరు జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కక్ష్య సాధింపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని వైయస్ఆర్‌సీపీ జి ల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో నీతి మాటలు వల్లించే సోమిరెడ్డి, రాజకీయ నాయకుల హుందాతనం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కాకాణి వ్యాఖ్యానించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నాణ్యానికి మరో వైపు ఆయన ప్రవర్తన ఉంటుందని ఆరోపించారు. ఒక దళిత సర్పంచ్‌ను నోటికి వచ్చినట్లు దూషించిన ఆడియో ఆధారాలు ఉన్నాయని, వైయస్ఆర్‌సీపీకి చెందిన దళిత సర్పంచ్‌పై అక్రమ కేసు నమోదు చేయాలని బూతులు తిట్టినట్లు పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని, కూటమి పాలనలో కక్ష్య సాధింపు చర్యలు పెరిగాయని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ వేధింపులకు పాల్పడటం సరికాదని అన్నారు.