<span style="text-align:justify">అమరావతి: రైతు సమస్యలపై చర్చించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. అయితే స్పీకర్ రైతు సమస్యలపై చర్చకు అనుమతించకుండా జీఎస్‌టీ బిల్లుపై చర్చకు అనుమతించారు. దీంతో విపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరి రైతు సమస్యలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనను పట్టించుకోకుండా శాసన సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చర్చను కొనసాగించడంతో సభ విపక్ష సభ్యుల నినాదాలతో హోరెత్తింది.</span>