వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త రవికుమార్‌ మృతి

మొగల్రాజపురం: స్థానిక ఏడో డివిజన్‌ వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త కాకర్లమూడి రవికుమార్‌ (46) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రవికుమార్‌ ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ చికిత్సపొందుతూ కన్నుమూశారు. పట్టణంలోని సీఎస్‌ఐ స్కూల్‌  సమీపంలోని ఆయన ఇంటి దగ్గర ఉంచిన భౌతిక కాయాన్ని వైయస్‌ఆర్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, ఏడో డివిజన్‌ కన్వీనర్‌ కత్తుల రవీంధ్రనాద్, నాయకులు అరుణ్‌కుమార్, సుభాషిణి సందర్శించి నివాళులు అర్పించారు.

Back to Top