968 స్థానాలతో ఆధిక్యంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్

హైదరాబాద్‌, 23 జూలై 2013:

అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కుమ్మక్కై పంచాయతీ ఎన్నికల బరిలో దిగినా అత్యధిక పంచాయతీలలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ జయకేతనం ఎగరేస్తోంది. ఓటర్లను ఎంతగా ప్రలోభపెట్టినా, ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్‌, టిడిపిలకు ఓటర్లు గట్టిగానే బుద్ధి చెప్పారు. రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తొలి విడత పోలింగ్‌ జరిగిన పంచాయతీల్లో వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ 968 స్థానాలలో, కాంగ్రెస్ 766 స్థానాలలో, టిడిపి 513 ‌పంచాయతీల్లో, టిఆర్ఎస్ 114 చోట్ల, ఇతరులు 613 పంచాయతీలలో ఆధిక్యతలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ వెలువడిన ఫలితాలు ఇవి. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలం పాండూరులో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు గెలుపొందారు. 502 ఓట్ల మెజారిటీతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీరాములు విజయం సాధించారు. తొట్టంబేడులోని రెండు స్థానాల్లో‌ ఒకటి వై‌యస్‌ఆర్ ‌కాంగ్రెస్ మద్దతుదారు గెలిచారు. శ్రీకాళహస్తిలో మూడు స్థానాల్లో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఏర్పేడు మండలంలో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ 2 స్థానాల్లో విజయం సాధించింది. పులిచర్ల మండలం 106 ఇ.రామిరెడ్డిగారిపల్లెలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారు సరోజమ్మ 82 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

కడప జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెంలో పార్టీ మద్దతుదారు లక్ష్మమ్మ గెలుపొందారు. అనంతపురం జిల్లా సిఆర్‌పల్లె సర్పంచ్‌గా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన మల్లమ్మ విజయం సాధించారు. కడప జిల్లా రాయచోటి మండలం గరిగపాతిరెడ్డివారి పల్లెలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారు రాజారెడ్డి 130 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం దొరమామిడిలో సత్తిబాబు (వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్) గెలుపొందారు. ఇదే జిల్లా మర్రిగూడెంలో కారం సావిత్రి (వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్) విజయం సాధించారు.

Back to Top