రేపు జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

వైయస్సార్ జిల్లాః నారాయణ విద్యాసంస్థలు విద్యార్థుల ప్రాణాలను హరించేస్తున్నాయి.  కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో పావని మృతికి కారణమైన యాజమాన్య తీరును నిరసిస్తూ వైయస్సార్ స్టూడెంట్ యూనియన్ రేపు జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. కడప రిమ్స్ లో పావని బంధువులను వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాష పరామర్శించారు. విద్యార్థిని ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలని, నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని పావని నిన్న (17)  హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Back to Top