సీకేప‌ల్లిలో మ‌హానేత విగ్ర‌హం ధ్వంసం

అనంతపురం:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు రోజు రోజుకు శ్రుతిమించుతున్నాయి. సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా గూడు క‌ట్టుకున్న దివంగ‌త  ముఖ్య‌మంత్రి వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని వారి నుంచి దూరం చేసేందుకు ప‌చ్చ పార్టీ నేత‌లు దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తున్నారు. అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం కొసాగుతోంది. వైయ‌స్‌ఆర్‌ విగ్రహాలపై టీడీపీ నేతలు దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తాజాగా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని సీకేప‌ల్లిలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని టీడీపీ శ్రేణులు అర్థ‌రాత్రి వేళ ధ్వంసం చేశారు.ఈ దాడిని వైయ‌స్ఆర్‌సీపీ అనంత‌పురం నేత‌లు తీవ్రంగా ఖండించారు. మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య అని రాప్తాడు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే టీడీపీ కార్యకర్తలు వైయ‌స్‌ఆర్‌ విగ్రహాలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే రాప్తాడులో ఇప్పటివరకూ ఎనిమిది వైయ‌స్‌ఆర్‌ విగ్రమాలపై దాడులు జరిగాయని ప్రకాశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నిందితుల‌ను కేసు న‌మోదు చేసి, క‌ఠినంగా శిక్షించాల‌ని, ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌శాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top