రైతు కుటుంబాల కోసం వైయస్ఆర్ బీమా పథకం

ఎర్రగుడి (పత్తికొండ) : రాష్ట్రంలో రైతుల చనిపోతే వారు కుటుంబాలను ఆదుకోడానికి సమగ్రమైన ఒక బీమా వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన రైతులతో ఆత్మీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.వైయస్ ఆర్ బీమా పేరుతో దీనిని అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. రైతు ఎక్కడైనా చనిపోతే బీమా కావాలి. రైతన్నలూ ఆత్మహత్యలు చేసు కోవద్దన్నారు.
తాను అనంతపురంలో ఆత్మహత్యలు చేసుకున్న దాదాపు 65 మంది రైతుకుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించానని వారిలో 10,15 మంది కి మాత్రమే చంద్రన్న భీమా ఇచ్చారని తెలిపారు. ఈ బీమా మొత్తాన్ని కూడా మొదట వారికున్న అప్పులకు జమ చేసి ఏమైనా మిగిలితే దానిని మాత్రమే రైతు కుటుంబాల చేతులకు ఇస్తున్నారు. ఇదీ ఇప్పటి బీమా తీరు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేలా వైయస్ఆర్ బీమా పేరుతో ఒక మంచి బీమా పథకాన్ని రూపొందిస్తామన్నారు.
అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యల వంటి వాటికి పాల్పడితే, నష్టపరిహారంగా చెల్లించే మొత్తం కూడా అప్పులు చెల్లించడానికే ఉపయోగిస్తే, ఆ కుటుంబాన్ని ఏం ఆదుకున్నట్లు? అప్పుల వాళ్లు ఇలా ఆ కుటుంబాలను వేధించే పరిస్థితులు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందుకు అనుగుణమైన చట్టాన్ని తీసుకుని వస్తామని భరోసా ఇచ్చారు. వైయస్ఆర్ బీమా కింద వచ్చే 5 లక్షలను రైతు భార్యకే అందిస్తాం. వారిని అప్పుల బాధల నుంచి విముక్తి కల్గించేందుకు చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. వైయస్ బీమా 5 లక్షల ను కుటుంబంలోని రైతు భార్యకే ఇస్తామని ప్రకటించారు.
రైతు సంక్షేమం కోసం ఇంకా ఏం చేస్తామంటే...
రైతు భరోసా కార్యక్రమం ద్వారా తొమ్మిది గంటలపాటు పగలే ఉచిత విద్యుత్, ప్రతి రైతుకు 12,500 ఇవ్వటం వల్ల రైతు ఉత్పత్తి వ్యయం పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. గతంలో దీనిని కేవలం సన్న,చిన్నకారు రైతులకే పరిమితం చేశాము,కానీ వివిధ వర్గాల సూచనలకు అనుగుణంగా ప్రతిరైతుకు దీనిని వర్తింపచేస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రైతు పంట అమ్ముకునేటప్పుడు రైతన్నకు గిట్టుబాటు ధరలు రాకపోవటం.. అప్పుడు రైతన్నలు నష్టపోయే పరిస్థితి వస్తోంది. రైతన్నకూ తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తామన్నారు. చంద్రబాబులా షాపులు లేవు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామనీ, ప్రతి రైతుకు పంట వేసే ముందు దాని ధర నిర్ణయిస్తామని, తక్కువకే అమ్ముకోవాల్సి వస్తే పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దీనివల్ల రైతన్నకు భరోసా కలుగుతుందన్నారు.
పంట వేసిన తర్వాత అకాల వర్షాలు వచ్చి.. కరువు వచ్చి నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొట్టే పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కెలామిటీ రిలీఫ్ ఫండ్ రూ.2వేల కోట్లు నిధులు కేటాయిస్తామన్నారు. పెడుతుందన్నారు. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం మరో 2వేల కోట్లు ఇస్తుందన్నారు. దీనివల్ల కరువు, అకాల వర్షాల వల్ల రైతన్న నష్టపోయే పరిస్థితులు ఉండవు.
జలయజ్ఞం ద్వారా ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుకు తోడుగా ఉంటామన్నారు. ఇదే విషయాన్ని నవరత్నాల్లో చెప్పాం. దీనికన్నా మెరుగైన మంచి ఆలోచనలు, సూచనలు ఇవ్వాలని రైతన్నలను జగన్ కోరారు. మార్పులు-చేర్పులు ఉంటే చెప్పాలని కోరారు.