తాగునీటి స‌మ‌స్య తీర్చిన వైయ‌స్ఆర్ సీపీ నేత‌

లింగనపల్లి (రాప్తాడు) మండల పరిధిలోని బొమ్మేపర్తి పంచాయతీలోని లింగనపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వైయ‌స్‌ఆర్‌ సీపీ యూత్‌ మండల కన్వీనర్‌ చిట్ట్రెడ్డి సత్య నారాయణరెడ్డి పరిష్కరించారు. రూ. 20 వేలు సోంత నిధులతో ఆయన గ్రామంలోని వైయ‌స్ఆర్‌ సర్కిల్‌ సమీపంలో ప్ర‌ధాన‌ రహదారిలో పాత బోరుబావికి 2 హెచ్‌పీ మోటర్, ఒక సింథటిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేసి గ్రామంలో నెలకోన్న తాగు నీటి సమస్యను పరిష్కరించారు. అనంత‌రం స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించి పార్టీని ముందుకు నడిపించాలన్న సంకల్పంతో ప్రతిపక్ష నేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సూచన మేరకు తనను మండల యూత్‌ కన్వీనర్‌గా ఎంపిక చేశారన్నారు. వారి సూచనల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. అందులో భాగంగానే లింగనపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, మోటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వారి కోరిక మేరకు తన సోంత నిధులు వెచ్చించి కొత్త మోటరు, ఒక సింథటిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. గ్రామ‌స్తుల క‌ళ్ల‌ల్లో నెల‌కొన్న ఆనందం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

Back to Top