కొనసాగుతున్న ఎమ్మెల్యేల దీక్షలు

కడప (వైయస్‌ఆర్‌ జిల్లా):

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. ఎమ్మెల్యే  శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతల బ్లడ్‌ షుగర్‌, సోడియం స్థాయులు  తగ్గాయనీ, దీక్షను ఇంకా కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశముందని వైద్యులు వారిని హెచ్చరించారు. మరోవంక,  ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అమర్‌నాథ్‌రెడ్డిల చేపట్టిన నిరవధిక దీక్షలు రెండో రోజుకు చేరాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్‌ కడప జిల్లావ్యాప్తంగా రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలను సమైక్యాంధ్రవాదులు కొనసాగిస్తున్నారు.

తాజా ఫోటోలు

Back to Top