గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన

తూర్పుగోదావరి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వైఎస్ జగన్ ను వీఆర్ఏలు కలిశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు జననేతకు విన్నవించుకున్నారు. అసెంబ్లీలో వీఆర్ఏల సమస్యలను ప్రస్తావిస్తామని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. 

ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటపొలాల్లో నీరు నిలిచిపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. వానల రూపంలో ప్రక్రతి బీభత్సం కంటే, మానవ నిర్లక్ష్యం తో జరుగుతున్న అనర్థమే ఎక్కువగా ఉంటోంది. పంట నానిపోయి, సరైన మద్దతు ధర లభించక రైతాంగం అల్లాడిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రైతులకు న్యాయం జరిగేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు  వైఎస్ జగన్ అక్కడ పర్యటిస్తున్నారు.  రైతులకు అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. పంటనష్టం గురించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలోని ఈతకోట పరిసర ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. లంక గ్రామాల్లో దెబ్బతిన్న తోటల్ని పరిశీలించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం అక్కడ నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంటారు. తణుకు పరిసర ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. 

తాజా వీడియోలు

Back to Top