మీకు తోడుగా..వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌రామ‌ర్శ యాత్ర‌

కుటుంబ స‌భ్యుల‌కు ఓదార్పు

వ‌రంగ‌ల్: వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల మ‌లి విడ‌త ప‌రామ‌ర్శ యాత్ర వ‌రంగ‌ల్ జిల్లాలో సాగుతోంది. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త ప‌రామ‌ర్శ యాత్ర పూర్తి కాగా, ఇప్పుడు రెండో విడ‌త పరామ‌ర్శ యాత్ర సాగుతోంది. అంత‌కు ముందు వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్, న‌ల్గొండ‌, రంగారెడ్డి జిల్లాల్లో ప‌రామ‌ర్శ యాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు వ‌రంగ‌ల్ జిల్లాలో సాగుతోంది.

ఉద‌యం హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని త‌న నివాసం నుంచి వైఎస్ ష‌ర్మిల బ‌య‌లు దేరారు. ఆమె వెంట తెలంగాణ వైఎస్సార్‌సీపీ నాయ‌కులు ఉన్నారు. మొద‌ట‌గా వ‌రంగ‌ల్ జిల్లాలోని గండ్ల‌కుంట‌లోని ఎడెల్లి వెంక‌ట‌య్య కుటుంబాన్ని ఆమె ప‌రామ‌ర్శించారు. త‌ర్వాత రేగుల‌లోని కొత్త‌గ‌ట్టు శాంతమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. అనంత‌రం రాయ‌ప‌ర్తి మండ‌లం కేశ‌వ‌పురం లోని రావుల మ‌హేంద‌ర్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. మ‌ధ్యాహ్నానికి ఈ మూడు ప‌రామ‌ర్శ‌లు పూర్త‌య్యాక వైఎస్ ష‌ర్మిల ముందుకు క‌దిలారు. 
అనంత‌రం రాయ‌పర్తిలో ని ముద్ర‌బోయిన వెంక‌ట‌య్య‌, నాంచారి మూడురు లోని గ‌ద్ద‌ల ముత్త‌య్య‌, మంద‌పురి కొండ‌మ్మ‌ల కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ తో మొద‌టి రోజు ఆరు కుటుంబాల్ని ప‌ల‌క‌రించిన‌ట్లుగా చెప్ప‌వ‌చ్చు. ఐదు రోజుల పాటు సాగుతున్న ఈ ప‌రామ‌ర్శ యాత్ర లో మొత్తం 900 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తారు. 31 కుటుంబాల్ని ప‌రామ‌ర్శిస్తారు.
Back to Top