నాగార్జునరెడ్డి కుటుంబానికి పరామర్శ

అనంతపురం: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనంతలో రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్నారు. మొదటిరోజు యాత్రలో భాగంగా...అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన వైయస్ జగన్ పెదవడుగూరు మండలం దిమ్మగుడిలో కౌలు రైతు నాగార్జున రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పత్తి పంట వేసి అప్పుల పాలవడంతో నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  రైతు భరోసా యాత్ర సందర్భంగా పలువురు రైతులు వైయస్ జగన్ ను కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని  రైతులు జననేత వద్ద వాపోయారు. 

 
Back to Top