పులివెందుల: దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వైఎస్సార్ జిల్లా వేంపల్లి లో నిర్వహించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల దండ వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు పట్టణం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన సేవల్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. నేటి పాలకులు దళితుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్న వైనాన్ని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.