జనవాణి వినిపించటమే ధ్యేయం

  • ఫిరాయింపుదారుల్ని స్పీకర్ కాపాడుతున్నారు
  • అసెంబ్లీలో ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించాం
  • బడ్జెట్ సమావేశాల మీద జన నేత వైఎస్ జగన్ స్పందన
  • హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల తీరు చంద్రబాబు దుష్పరిపాలనకు అర్థం పడుతోందని
    ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడేందుకు స్పీకర్ ను అడ్డు పెట్టుకొంటున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ
    సమావేశాలు పూర్తయిన తర్వాత సమావేశాల తీరు తెన్నుల మీద వైఎస్ జగన్ మీడియాతో
    మాట్లాడారు. వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

    అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడం, రోజమ్మకు హైకోర్టు
    అండగా నిలవటం, అగ్రి గోల్డ్ బాధితులకు మేమంతా తోడుగా నిలవటం, ప్రైవేటు సంస్థలతో
    కుమ్మక్కై ప్రభుత్వం చేసిన అక్రమ విద్యుత్ కొనుగోళ్లను నిలదీయటం వంటి విషయాల్ని
    గమనించటం జరిగింది. రాజధాని భూముల్లో ముఖ్యమంత్రే ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతూ,
    ఓట్ ఆఫ్ సీక్రెసీని భంగపరిచారు. రాజధాని ఎక్కడ వస్తుందో తెలిసీ, నూజివీడు
    నాగార్జున యూనివర్శిటీ అంటూ ఫీలర్లు ఇచ్చి ప్రజల ఆలోచనల్ని పక్క దారి పట్టించారు.
    తర్వాత బినామీలంతా కొనుగోళ్లు చేశాక రాజదాని వస్తుందని ప్రకటించి ఇన్ సైడర్
    ట్రేడింగ్ కు పాల్పడ్డారు. ఇది ఓట్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘించటమే అనుకోవాలి. రాజధాని
    ప్రాంతంలో రక రకాలుగా రైతుల్ని మోసం చేశారు. 


        రాజధాని ప్రాంతంలో రైతుల్ని ఏ రకంగా మోసం చేశారు
    అనేది తెలుసుకొనేందుకు జోనల్ విధానాన్ని చూడవచ్చు. బినామీలు రియల్ ఎస్టేట్
    వ్యాపారం చేసుకొనేందుకు దీన్ని రూపొందించారు. రైతులు మాత్రం భూములు అమ్ముకోడానికి
    లేకుండా చేశారు. అక్కడ రాజధానిలో బినామీల భూముల్ని ల్యాండ్ పూలింగ్ లోకి
    తీసుకోకుండా, రైతుల భూముల్ని మాత్రం తీసుకొన్నారు. ఇదే విషయాన్ని అడగటం జరిగింది.
    ఇసుక లో చంద్రబాబు స్వయంగా నీకెంత..నాకెంత.. అన్న విధంగా వాటాలు పంచుకొంటూ
    మాఫియాను నడిపించారు. అక్షరాలా రెండువేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆర్థిక మంత్రి
    యనమలే స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో పతివ్రత అయిపోయినట్లుగా కబుర్లు చెబుతున్నారు.
    ఈ విషయాల్నే ప్రశ్నించటం జరిగింది. ’’

    అని వైఎస్ జగన్ అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుని ఎండగట్టారు. 

Back to Top