తోనోకుతోన్న తణుకు


చంద్రబాబూ.. నీకు పోగాలం దాపురించింది. అందుకే రైతుల మీద పగపట్టావు.
పంట వేయొద్దన్నావ్.
వ్యవసాయం చేయొద్దన్నావ్.
రైతుకు రుణం పుట్టకుండా చేశావ్.
వడ్డీలు కూడా కట్టకుండా వాగ్దానం తప్పావ్.
చివరికి దిగజారిపోయి మన ఆడపడుచులకూ అన్యాయం చేశావ్.
ఇటువంటి చంద్రబాబు అధికారంలో ఉండటం 60 శాతం మంది ఉన్న రైతులు, 50 శాతం ఉన్న మహిళలు మన క ర్మగా భావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడుకి ఇకనైనా మంచి బుద్ది ప్రసాదించాలని వారంతా దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఇంత దుష్పరిపాలనను తెలుగు ప్రజలకు రుచి చూపిస్తున్నావ్.. చరిత్ర నిన్ను క్షమించదు.

చంద్రబాబు ఆగడాలను ప్రశ్నించేందుకు, ప్రజలకు పలు వాగ్దానాలు చేసి మాట
తప్పిన టీడీపీ సర్కారును నిలదీసేందుకే.. ఈ నెల 31, ఫిబ్రవరి 1 వ తేదీన
రెండు రోజుల పాటు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దీక్ష
తలపెట్టారు. రాజధాని భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా నిలిచేందుకు, రాష్ర్టంలోని రైతులందరికీ రుణమాఫీ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆయన ఈ దీక్ష తలపెట్టారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ఏకపక్ష నిర్ణయాలతో ఒంటెద్దు పోకడలు పోతున్న చంద్రబాబు తీరును ఆయన ఈ వేదిక నుంచి ఎండగట్టనున్నారు.
Back to Top