చంద్రబాబు కలలో కూడా నేనే కనిపిస్తానేమో!



– రైతులకు ఏడు గంటలు కూడా పగటి పూట కరెంట్‌ ఇవ్వడం లేదు
– కృష్ణా డెల్టా కాల్వలను ఆధునీకరించాలని వైయస్‌ఆర్‌ ఆరాటపడ్డారు
– రైతులకు నీళ్లు ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు
–  పేదల ఇళ్లలో కూడా చంద్రబాబు స్కాంలకు పాల్పడుతున్నారు
– ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా టీడీపీలో చేర్చుకున్నారు
– సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఏమంటారు?
– ప్రత్యేక హోదాపై చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారట
– చంద్రబాబుకు ఆస్కార్‌ రాకపోవడం ఆశ్చర్యం
– చంద్రబాబు డ్రామాలు, యాక్షన్‌లను ప్రజలు గమనించాలి
– బీసీల మీద నిజమైన ప్రేమ చూపించింది వైయస్‌ఆరే
– ఎన్ని లక్షలు ఖర్చైనా మీ పిల్లలను నేను చదివిస్తాను
–మెస్, బోర్డింగ్‌ ఛార్జీలకు ఏడాదికి రూ.20 వేలు
– చిన్నారులను బడికి పంపించిన తల్లులకు ఏడాదికి రూ.15 వేలు


గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పొద్దున లేచింది మొదలు నిత్యం తనపేరే జపిస్తున్నారని, బహుశా ఆయన కలలో కూడా తా నే కనిపిస్తున్నానేమో అని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కూడా లేచి జగన్‌..జగన్‌ అంటారేమో అన్నారు. దొంగే దొంగ ..దొంగ అని అరిచినట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం అనిపేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారట. ఆయన నటకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వవచ్చు అని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పేదల పథకాల్లో కూడా స్కాంలకు పాల్పడ్డారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ  అధికారంలోకి వస్తే చదువుల విప్లవం తీసుకువస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే ..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

– ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ అంతే తీవ్రమైన ప్రేమ, అనురాగాలు చూపుతున్న జిల్లా గుంటూరు. ఎండలు తీక్షణంగా ఉన్నా కూడా వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి ఎండలో నాతో పాటు నడవాల్సిన పని లేదు. ఇలా నడిరోడ్డుపై నిలబడాల్సిన అవసరం లేదు.అయినా కూడా లెక్క చేయకుండా చిక్కని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచిపెడుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
– జిల్లాలో అడుగుపెట్టగానే రైతులు నా వద్దకు వచ్చి అన్నా..ఎలా ఉన్నారన్నా అంటున్నారు. నియోజకవర్గంలో పండే పంటల గురించి తమ బాధలు చెపుకుంటున్నారు. వరి ఉత్పత్తి ఖర్చు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.19 వేలు అవుతుందని చెబుతున్నారు. మాకు వచ్చేది రూ.12 వేలు మించడం లేదని చెబుతున్నారు. మినుములు క్వింటాల్‌కు రూ.4 వేలు ఇచ్చే నాథుడు లేడు. పెసలు రూ.4 వేలు కూడా లేదు. రాష్ట్రంలోనే ఈ జిల్లాలో మొక్కజొన్న ఎక్కువ, ఈ మొక్కజొన్నకు మద్దతు ధర లేదని చెబుతున్నారు. నాలుగేళ్లుగా రైతులు ఇదే రకమైన ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నుంచి దళారుల వద్దకు చేరగానే రేటు ఆకాశాన్ని అంటుతోంది.  ఇందుకు కారణం ముఖ్యమంత్రిగా ఉండాల్సిన  వ్యక్తి దళారులకు తానే నాయకుడిగా ఉంటున్నారు. సాక్ష్యాత్తు చంద్రబాబే హెరిటేజ్‌ ఫుడ్స్‌ పెట్టారు. తన సంస్థ లాభాల కోసం రైతుల వద్ద నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తారు. ఆ తరువాత నాలుగు రేట్లకు హెరిటేజ్‌ షాపుల్లో అమ్ముతున్నారు. ముఖ్యమంత్రే ఇలా చేస్తే రైతులు ఎవర్ని అడగాలి.
– అన్నా..ఖరీఫ్‌కు నీరు సరిగా ఇవ్వలేదన్నా..రబీలో అసలే నీరు లేదన్నా అంటున్నారు. బోర్లు కింద సాగే అయ్యే పంటలకు కరెంటు ఇవ్వడం లేదన్నా అంటున్నారు. కరెంటు మిగులు అంటున్న ప్రభుత్వం కనీసం 7 గంటలు కూడా పగటి పూట ఇవ్వడం లేదన్నా అంటున్నారు. అర్థరాత్రి కరెంటు ఇస్తున్నారని రైతులు చెబుతుంటే బాధనిపిస్తుంది.
– కృష్ణా డెల్టాలో భాగమైన ఈ నియోజకవర్గంలో కాల్వలు అధునీకరించకపోవడంతో హైలెవెల్‌ కెనాల్‌కు నీరు రావడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాల్వలు ఆధునీకరించేందుకు చర్యలు తీసుకున్నారు. మహానేత చనిపోయాక వీటిని పట్టించుకునే నాథుడు లేడు. రైతులకు సాగునీరు అందించలేని అసమర్ధ ప్రభుత్వం ఇది.
– గృహనిర్మాణాల పేరుతో మోసం చేస్తున్నారు. 2 వేల పక్కా ఇల్లు కట్టిస్తున్నారట. 300 అడుగుల ప్లాట్‌ అక్షరాల రూ.6 లక్షలట. చంద్రబాబుకు ఆ ప్లాట్‌ కట్టించే కాంట్రాక్ట్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా? కాంట్రాక్టర్‌ చంద్రబాబుకు కమీషన్లు ఇస్తారట. పేదవాడి జీవితాలతో చంద్రబాబు స్కాం చేస్తున్నారు. రూ.6 లక్షలు అయ్యే ప్లాట్‌లో రూ.3 లక్షలు అప్పుగా ఇస్తారట. లంచాలు తీసుకునేది చంద్రబాబు..నెల నెల రూ.3 వేల చొపున 20 నెలలు కంతులు కట్టాల్సింది పేదవాడట.
– రాజధానిలో ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇక్కడ అసెంబ్లీ, సెక్రటెరియట్‌ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. టెంపరరీ బిల్డింగ్‌ కట్టేందుకు అడుగుకు రూ.10 వేలు కాంట్రాక్టర్లకు ముట్టజెప్పారు. ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది.
– పొన్నూరులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మహిళలు చెబుతున్నారు. 70 శాతం గ్రామాలకు ఇవాళ్టికి తాగునీటి సమస్యలు ఉన్నాయి. క్యాన్‌ రూ.30 పెట్టి కొనాల్సి వస్తోంది.
– చంద్రబాబు పాలన గురించి మాట్లాడాల్సి వస్తే నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది. 
ఎవరైనా పొద్దున లేస్తే రోజంతా మంచి జరగాలని దేవున్ని ప్రార్థిస్తాం. రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని మొదలుపెడతాం. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో మాట మాట్లాడితే చాలు జగన్‌..జగన్‌..ఆయన మంత్రులు కూడా జగన్‌ అట్లా..ఇట్లా అంటున్నారు. బహుశా చంద్రబాబు కలలో కూడా నేనే కనిపిస్తానేమో. ఆయన పరిస్థితి చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. ఆయన తీరు ఎలా ఉందంటే..దొంగనే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది.ఇతరులపై నేరాన్ని నెట్టేందుకు దొంగ దొంగ అని అరుస్తాడు..ఆయనకు సంబంధించిన టీవీలు, పేపర్లు దొంగ దొంగ అంటారు. చంద్రబాబు తన మాదిరిగా మోసాలు, నేరాలు చేసేవారు. ప్రజాస్వామ్యాన్ని ఉరి తీసే వారిని ఏమంటారు. సొంత మామ ప్రాణాలు తీసి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న వ్యక్తిని ఏమంటారు. కోట్లాది రూపాలయ నల్లధనంతో లంచాలు ఇస్తూ ఆడియో,వీడియో టేపులతో దొరికిపోయిన వ్యక్తిని ఏమంటారు. ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు, రాజధాని భూములు, గుడి బూములు మేసేవారిని ఏమంటారు. 22 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కిరికి రూ.30 కోట్లు ఎర చూపి, మంత్రి పదవి ఇస్తానని ఎర చూపుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలను తన పార్టీపై గెలిపించుకునే సత్తా లేని వ్యక్తిని ఏమంటారు. ఐదు కోట్ల మందిలో ఒక్కరే ముఖ్యమంత్రి అవుతారు. సీఎం అన్న వ్యక్తి ఎలా పరిపాలిస్తున్నారు అన్నది ప్రజలు చెబుతారు. ఆ పరిపాలన బాగలేకపోతే ఈ మనిషి ఎప్పుడెప్పుడు పోతారా అని ప్రజలు కోరుకుంటారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా
– నాలుగేళ్లుగా చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదు. పిల్లలకు ఉద్యోగాలు కల్పించానని, పిల్లల కోసం పాకులాడానని ప్రజల మధ్యకు వచ్చి చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? రైతులకు, పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఆరోగ్యశ్రీని ఆరోగ్యంగా, అందరికి మేలు చేసేలా నడుపుతున్నాను అని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు ఉందా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పిల్లలు బాగా చదువుతున్నారు. ఆ పిల్లలు అప్పులపాలు కాకుండా, ఆస్తులు అమ్ముకోకుండా ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారని చెప్పుకునే ధైర్యం ఉందా.? ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించానని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా. కరెంటు, డీజిల్, ఇంటి పన్నులు పెంచలేదని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? 9 గంటలకు పగటి పూట ఉచితంగా విద్యుత్‌ ఇస్తానని చెప్పిన వ్యక్తి కనీసం 7 గంటలైన ఇచ్చారా? 
–ఇప్పుడు కూడా ఈ పెద్ద మనిషి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయరట. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వరట. ఇలాంటి వ్యక్తి సీఎంగా కొనసాగడం ధర్మమేనా? 
– ఏడాదిలో ఎన్నికలు వస్తాయని ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న డ్రామాలు గమనించమని కోరుతున్నాను. ఈ మధ్య కాలంలో పేపర్‌లో చూశాను. ప్రఖ్యాతి గాంచిన విదేశీ సంస్థలు నటనలో ప్రతిభ కనబరిచిన వారికి  ఆస్కార్‌ అవార్డులు ఇస్తారు. వీదేశీ సంస్థలు కదా మన రాష్ట్రం వైపు చూడలేదేమో అనిపించింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో చూస్తే చంద్రబాబు కళ్లలో నీళ్లు ఇలా..సీన్‌ కట్‌..యాక్షన్‌..టాఫిక్‌ ప్రత్యేక హోదా ఈ సీన్లు చూస్తే ఆశ్చర్యమనిపించింది. అయ్యా చంద్రబాబు నీవు ప్రజలను అన్ని రకాలుగా మోసం చేశావు. చివరకు నీ చేతుల్లో ఉన్న ప్రత్యేక హోదాను ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసింది వాస్తవం కాదా? ఇదే చంద్రబాబును మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మార్చి 2 , 2014న రాష్ట్రాన్ని విభజించిన సమయంలో మీరు కూడా దగ్గరుండి పార్లమెంట్‌ సాక్షిగా విడగొట్టారు. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. అప్పటి కేంద్ర కేబినెట్‌ ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్లానింగ్‌ కమిషన్‌కు నివేదికలు పంపించింది వాస్తవం కాదా. ఆ తరువాత మీ భాగస్వామ్య ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత 7 నెలల పాటు ఆ ఫైల్‌ ప్లానింగ్‌ కమిషన్‌లో పడి ఉన్నది వాస్తవం కాదా? జూన్‌ మాసంలో నీవు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏం చేశావు చంద్రబాబు..గాడిదలు కాశావా? 7 నెలల పాటు ప్లానింగ్‌ కమిషన్‌ నిర్ణయం కోసం ఎదురుచూశాం. 13వ ఆర్థిక సంఘం సిఫార్సులో ఉన్నది వాస్తవం కాదా? 14వ ఆర్థిక సంఘంతో మనకు ఏం పని? 11 నెలల పాటు 13వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు ఎన్‌డీఏ ఏం చేసింది? చంద్రబాబు గంగిరెద్దు మాదిరిగా తల ఊపారు. 14వ ఆర్థిక సంఘం అబిజీత్‌సేన్, గోపాల్‌రావు మేం ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పలేదని చెప్పింది వాస్తవం కాదా? ఇవాళ అరుణ్‌జైట్లీ ఏదో స్టేట్‌మెంట్‌ ఇచ్చారని చంద్రబాబు హఠాత్తుగా రియాక్ట్‌ అయి తన మంత్రులతో రాజీనామా చేయించారు. అరుణ్‌జైట్లీ 2016 అక్టోబర్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఈ స్టేట్‌మెంట్‌కు తేడా ఉందా? అప్పట్లో అర్థరాత్రి స్వాగతించి, మరుసటి రోజు అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపింది వాస్తవం కాదా? ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది వాస్తవం కాదా? ఏపీ అభివృద్ధిలో పరుగెత్తుందని చెబుతున్నారు. 12 శాతం గ్రోత్‌ రేట్‌ అని చెప్పడం సరైంది కాదు. విశాఖలో సీఐఐ సదస్సులు పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం ధర్మమేనా? తప్పుడు లెక్కలు చెప్పడం న్యాయమేనా? అంతా బాగుంటే ఎవరైనా ఇస్తారా? 
– ప్రత్యేక హోదా గురించి నిన్న చంద్రబాబు కన్నీళ్లు తుడుచుకుంటూ యాక్షన్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని నీ మంత్రులతో రాజీనామా చేయించారు. రెండేళ్ల క్రితం ఇదే పని చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది. రాష్ట్రానికి మోడీ వస్తున్నారని నేను నిరాహార దీక్ష చేస్తుంటే..తెల్లవారుజామున దీక్షలను భగ్నం చేయించింది వాస్తవం కాదా? యువభేరీ కార్యక్రమలకు వస్తే పిల్లలపై పీడీ యాక్ట్‌ కేసులు అన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఇదే నాటకాలు ఆడారు. కేంద్రంపై నెపం పెట్టడం..తనకు సంబంధించిన మీడియాతో వార్తలు రాయించుకుంటారు. అసెంబ్లీలో ఆస్కార్‌ ఫెర్మామెన్స్‌తో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 
– ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చెబుతున్నారు. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడు కావాలా?మోసాలు చేసేవాడు మీకు నాయకుడు కావాలా? ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఒక్క జగన్‌ వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం దొరుకుతుంది.
– పొరపాటున చంద్రబాబును క్షమిస్తే..రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? రేపు పొద్దున చంద్రబాబు ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటారు. నమ్మరు అని తెలుసు కాబట్టి ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి గుంజిన సొమ్మే. ఓట్లు మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసే వారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థాలు వస్తాయి.
– మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది చెప్పేందుకు ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం. ఇందులోని అన్ని అంశాలను ఒకే మీటింగ్‌లో చెప్పాల్సి వస్తే సమయం సరిపోదు. ఈ రోజు మన పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లుగా చదివించే పరిస్థితి ఉందా? ఇంజినీరింగ్‌ ఫీజులు ఏడాదికి లక్ష అవుతుంది. ప్రభుత్వం ఇచ్చేది ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగతా డబ్బుల కోసం ఆ పేదవాడు ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. 
–ఒక్కసారి నాన్నగారి పాలన గుర్తుకు తెచ్చుకోండి. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రమే బీసీలపై ప్రేమ అంటారు. నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టేలు ఇస్తే సరిపోతుందా? నిజంగా బీసీలపై దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రేమ చూపారని గర్వంగా చెబుతున్నారు. పేదవాడి కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజినీర్‌ అయితే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని నమ్మిన వ్యక్తి వైయస్‌ రాజశేఖరరెడ్డి. నాన్నగారు చనిపోయిన తరువాత పరిస్థితి మొదటికి వచ్చింది. పేదవారిపైన ఏ ఒక్కరూ ప్రేమ చూపడం లేదు. ప్రతి పేదవాడి కోసం చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేశారు. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేను భరిస్తా. అంతేకాదు ఆ పిల్లలకు అయ్యే హాస్టల్‌ ఖర్చులు, మెస్‌ చార్జీలు కూడా ఇస్తాం. మీ పిల్లలను ఇంజినీర్లను చేయడమే కాదు..పెద్ద పెద్ద చదువులు చదివించడమే కాదు హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి తల్లికి చెబుతున్నాను. మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలంటే ఆ పునాదులు ఈ చిట్టి పిల్లల నుంచి పుడతాయి. ఈ చిట్టి పిల్లలు రేపు పొద్దున బడులకు వెళ్తేనే మన బతుకులు మారుతాయి. ఆ తల్లి తన బిడ్డను బడికి పంపిస్తే ..ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ప్రతి తల్లికి తోడుగా ఉండేందుకు నవరత్నాలతో మనం ఏం చేయబోతున్నామో మీ అందరికి చెప్పాం. ఇందులో మార్పులు, చేర్పులు ఏదైనా ఉంటే మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి. నేను ఎక్కడ పడుకొని ఉంటానో, ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నానో మీ అందరికి తెలుసు. మీ అందరు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా..
 
Back to Top