చిత్తూరులో ఘోర ప్రమాదం..వైయస్ జగన్ దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 20 మంది మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే సహాయక చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు.

ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఓ లారీ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 20మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత‍్తం రుయా ఆస్పత్రికి తరలించారు
Back to Top