మే 1,2 తేదీల్లో వైయస్ జగన్ రైతు దీక్ష

హైదరాబాద్ః టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతుల నానా అవస్థలు పడుతున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రైతులను ఆదుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా  వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గుంటూరు వేదికగా  రైతు దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 26, 27 తేదీల్లో తలపెట్టిన దీక్షను మే 1,2 తేదీలకు వాయిదా వేసినట్లు చెప్పారు. రైతులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మద్దతు ధర కోసం ప్రభుత్వం మెడలు వంచుదామని ధైర్యం చెప్పారు.

Back to Top