హాస్టల్స్ ను తగ్గించవద్దు: వైఎస్ జగన్

హైదరాబాద్) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలగచేసుకొన్నారు. సంక్షేమ హాస్టల్స్ ను రెసిడెన్సియల్ పాఠశాలలుగా మార్చుతారని చెబుతున్నారని, ఇది సంతోషదాయకమే కానీ ఉన్న హాస్టల్స్ ను తగ్గించాలనుకోవటం సరి కాదని అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. 
Back to Top