ప్రజల్లోకి వెళ్లగలరా: వైఎస్ జగన్

హైదరాబాద్) పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల మీద ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో స్పందించారు. సభ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా
ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన జ్యోతుల
నెహ్రూని చంద్రబాబు ప్రభావితం చేశారని ఆయన అభిప్రాయ పడ్డారు. వ్యక్తిత్వం,
విశ్వసనీయత లేకపోతే నాయకుల వెంట భార్యలు కూడా నిలవరు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో
కలిసి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకి లేదని స్పష్టం చేశారు. పార్టీ మారిన
ఎమ్మెల్యేలకు పదవులు కావాలి కానీ, రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం మాత్రం
లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. 

Back to Top