నేడు మెళియాపుట్టిలో వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభ

శ్రీకాకుళంః నేటి సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి గ్రామంలో వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభ జరగనుంది. గ్రామం అంతా పార్టీ జెండాలు, ప్లెక్సీలతో నిండిపోయింది. ప్రజలంతా వైయస్‌ జగన్‌ ప్రసంగం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు సభాస్థలికి చేరుకుంటున్నారు.తమ సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని తిత్లీ తుపాన్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తిత్లీ తుపాన్‌ నష్టప రిహారం విషయంలో అన్యాయం జరిగిందని తెలిపారు.మూడు ఎకరాలు భూమి ఉన్నా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ భూమి ఉన్నట్లుగా రాయించుకుని నష్టపరిహారం కాజేశారని బాధితులు మండిపడ్డారు.గిరిపుత్రుల సంక్షేమం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పాతపట్నంలో 50 పడకల ఆసుపత్రి ఉన్నా వైద్యులు లేకపోవడంతో  సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సాగువాడ–రొంపవలస బ్రిడ్జి నిర్మిస్తామని హామీ నేటికి కూడా ఆచరణలో పెట్టలేదన్నారు.పాతపట్నాని పాలకొండ డివిజన్‌ కేంద్రంగా మారుస్తామని చెప్పి కేవలం మాటలకే పరిమితం చేశారన్నారు. తిత్లీ తుపాన్‌లో పాతపట్నం నియోజకవర్గంలో తీవ్రనష్టం జరిగిన కూడా ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో బాలికల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని  చెప్పి టీడీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాబోయే రోజుల్లో  పాతపట్నం నియోజకవర్గంతో పాట, రాష్ట్రానికి కూడా వైయస్‌ జగన్‌తో మేలు జరగబోతుందన్నారు.దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలను వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Back to Top