– రాజన్న దొరకు ఉన్న వ్యక్తిత్వం బొబ్బిలి రాజుకు లేదు
– బొబ్బిలి ఎమ్మెల్యేను సంతలో పశువు కొన్నట్లు కొన్నారు
– రాజన్న దొరను కూడా టీడీపీ నేతలు కొనాలని చూశారు
– జర్వాలు వచ్చి 86 మంది చనిపోయారు
– జ్వరాలతో జనం మరణిస్తుంటే..బాబు ఏం చేస్తున్నారు
– నాలుగున్నర ఏళ్లు గడిచింది..అగ్రిగోల్డు బాధితుల పరిస్థితి ఏంటి
– అగ్రిగోల్డు విలువైన ఆస్తులు ఎలా కొట్టేయాలన్న ఆలోచన తప్ప..ఆదుకోవడం లేదు
– రాష్ట్రంలో లంచం లేనిదే ఏ పని జరగదు
–బాబుకు బ్రోకర్ పనులు తప్ప వేరే యావ లేదు
– బ్యాంకుల్లో బంగారం ఇంటికి వచ్చిందా
– చంద్రబాబుకు సిగ్గు,శరం లేదు
– రుణమాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను మోసం చేశారు
– ప్రకృతిని హ్యాండిల్ చేశాను..సముద్రాన్ని కంట్రోల్ చేశానని చెప్పుకుంటున్నారు
– పింఛన్ రూ.2 వేలకు పెంచుతాను
విజయనగరం: తిత్లీ తుపాను బాధితులకు వైయస్ జగన్ భరోసా కల్పించారు. వారం రోజుల్లో తిత్లీ తుపాను బాధిత ప్రాంతానికి వెళతానని, శ్రీకాకుళం జిల్లాలో 50 రోజుల పాటు ఉంటానని వైయస్‌ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తిత్లీ తుపాను కారణంగా రూ.3435 కోట్ల నష్టం వచ్చిందని చంద్రబాబే చెబుతున్నారని, ఈ నష్టాన్ని భర్తీ చేయకుంటే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజన ఎమ్మెల్యే రాజన్న దొరకు ఉన్న వ్యక్తితం బొబ్బిలి రాజుకు లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సాలూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.జననేత ఏమన్నారంటే..వైయస్ జగన్ మాటల్లోనే..
– సాలూరులో అడుగుపెడుతూనే గిరిజన ప్రాంతం, గిరిజన నియోజకవర్గం, ప్రాతినిధ్యం వహిస్తున్నది గిరిజన ఎమ్మెల్యే. ఇక్కడ గిరిజన ఎమ్మెల్యే రాజన్న దొరకు ఉన్న వ్యక్తిత్వం పక్కనే ఉన్న రాజులకు కూడా లేదని గర్వంగా చెబుతాను. పక్కనే సంతలో పశువులను కొన్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యేను కొన్నారు. రాజన్న దొరను కూడా కొనడానికి ప్రయత్నం చేస్తే..తాను అమ్ముడబోనని చెప్పిన ఘతన మీ ఎమ్మెల్యేది.
– ఈ నియోజకవర్గంలో అడుగుపెడుతూనే..ఇక్కడి పాలన గురించి చెప్పారు. ఈ ఏడాది జ్వరాలు వచ్చి మనుషులు చనిపోతున్నారని, ప్రభుత్వం పడుకొందని జనం చెప్పారు. సాలూరు మండలంలోనే 21 మంది జ్వరాలు వచ్చి చనిపోయిన పరిస్థితి చూశాం. కరాస వలసలో నెల రోజుల్లో ఏకంగా 11 మంది చనిపోయారు. జ్వరాలతో గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతుంటే చంద్రబాబు నీవు పడుకున్నావా అని అడుగుతున్నాను.
– కిందటి జులై 24న చిన్నమ్మ అనే మహిళ సాలూరు పీహెచ్‌సీలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి పరిస్థితి విషమించడంతో విజయనగరంలో గోసా ఆసుపత్రికి తరలిస్తే..అక్కడ ఆక్సిజన్ లేక చనిపోయింది.
– మహానేత పాలనలో 108కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేది. ఇవాళ అంబులెన్స్‌లు ఏవీ కూడా కండీషన్లు లేవు. పొరపాటున వచ్చిన అంబులెన్స్ ఆసుపత్రి దాకా తీసుకెళ్తుందో లేదో అన్న భయం ఉంది.
– సాలూరు సీహెచ్‌సీ ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం నలుగురితో పని జరుపుతున్నారు.
– అన్నా..ఆ రోజు నాన్నగారు సాగునీటి ప్రాజెక్టు కోసం రైతులకు తోడుగా ఉండేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి గారు పెద్ద గడ్డ రిజర్వాయర్ పనులు పూర్తి చేశారు. నాన్నగారి పుణ్యానా 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ రిజర్వాయర్ నుంచి కాలువ తవ్వుతామని ఇచ్చిన హామీకి ఇంతవరకు దిక్కు లేదు అంటున్నారు. నీళ్లు అందించి మేలు చేయాల్సిన ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని జనం చెబుతున్నారు.
– మెంటాడ మండలంలోని ఏపీ హై లెవల్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు చెప్పారు. ఈ కెనాల్ నాలుగున్నరేళ్ల పాలనలో పూర్తి చేశారా? కుప్పకూలిన గోమూఖి రెగ్యులేటర్ కనిపిస్తుంది. సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు కుప్పకూలింది. ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాల్సి ఉండగా ఏమీ పట్టించుకోవడం లేదు.
– ఇదే ప్రాంతంలో కూరగాయలు పండిస్తారు. పండ్ల తోటలకు ప్రసిద్ధి. రైతులకు అందుబాటులో రేట్లు లేవు. వంకాయలు కేజీ రూ.16 చొప్పున కొని చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో రూ.40 చొప్పున అమ్ముతున్నారు. బీరకాయలు రూ.15 చొప్పున కొని రూ.40 అమ్ముతున్నారు. బెండకాయ కేజీ రూ.36 చొప్పున అమ్ముతున్నారు. కాకర కాయలు కేజీ రూ,50 చొప్పున హెరిటేజ్ షాపుల్లో అమ్ముతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు కానీ, చంద్రబాబు షాపుల్లో మాత్రం రెండింతల రేట్లకు అమ్ముకుంటున్నారు. దళారీలను కట్టడి చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి దళారీలకు నాయకుడయ్యారు. రైతులను అన్యాయం చేస్తున్నారు.
– సాలూరులో ప్రజలు నా వద్దకు వచ్చి చెబుతున్న మాట..పెద్దగడ రిజర్వాయర్ నుంచి సాలూరుకు మంచినీరు ఇచ్చేందుకు రూ.50 కోట్లతో పనులు మంజూరు చేశారు. ఇంతవరకు ఈ పనులు చేపట్టలేదని చెబుతున్నారు.
– ఈ నియోజకవర్గ ప్రజల కోసం రూ.33 కోట్లతో వైయస్‌ఆర్ మెగా వాటర్ స్కీమ్‌ను నిర్మించారని చెబుతున్నారు. అప్పట్లో ప్రారంభిస్తే..ఇవాళ ఆ స్కీమ్‌ను సరిగ్గా నడపడం లేదు. కేవలం 30 గ్రామాలకే నీరు ఇస్తున్నారు. 60 గ్రామాలకు నీరు అందడం లేదని చెబుతున్నారు.
– సాలూరు మండలంలో 26 గ్రామాలకు వెంగాలయ ప్రాజెక్టు నుంచి వైయస్‌ఆర్ తాగునీటిని అందించారు. ఈ స్కీమ్‌ను సరిగ్గా నడపడం లేదు. తాగునీరు ఇవ్వలేని అన్యాయమైన ప్రభుత్వం ఇది.
– జాతీయ రహదారి ఊరి మధ్య నుంచి వెళ్తుంది. కాలుష్య సమస్య ఉంది. సాలూరుకు బైపాస్ వేయ్యాలన్న జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు.
– చంద్రబాబు సీఎం కాకముందే అటో నగర్ కోసం స్థలాలు కేటాయించి కొంత మేర పనులు ప్రారంభించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఆటో నగర్ పనులు ఎక్కడివక్కడే నిలిచాయని చెబుతున్నారు. అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదని చెబుతున్నారు.
– ఇక్కడి టీడీపీ ఇన్‌చార్జ్ గురించి స్థానికులు చెబుతున్నారు. బంగి దేవుడు అనే వ్యక్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. 30 ఎకరాలు ఆక్రమించి చెపల చెరువు తవ్వించి పెద్దగడ రిజర్వాయర్ నుంచి అక్రమంగా నీరు తీసుకెళ్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయమైన పాలన గురించి చెబుతున్నారు.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో ఆలోచన చేయండి. చాలా మంది ఆగ్రిగోల్డు బాధితులు నా వద్దకు వచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనలో బాధితులకు చంద్రబాబు డబ్బులు ఇప్పించారా? బాధితులను ఆదుకోవాలన్నా ఆరాటం చంద్రబాబుకు లేదు. ఆ ఆస్తులు ఎలా కొట్టేయాలని ఆలోచన చేస్తున్నారు. బినామీలతో ఆస్తులు కొనుగోలు చేయించి తక్కువకు వేలంలో దక్కించుకుంటున్నారు. బ్రోకరిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
– రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. రైతుల రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. సున్నా వడ్డీ రుణాలు లేవు. చంద్రబాబు చేసిన మాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. అక్కచెల్లెమ్మలను కూడా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు.
– బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వకుంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబుకు సిగ్గు,శరం లేదు. బాబు వచ్చాడు..ఉన్న ఉద్యోగాలు పోయాయి. విశాఖలో మీటింగ్ పెట్టి చెబుతున్నారు. రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయట, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయట. ఎక్కడైనా కనిపించాయా? కాంట్రాక్టు కార్మికులు భయంతో బతుకుతున్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో 55 నెలల పాటు నెలకు రూ.2 వేల చొప్పున ప్రతి ఇంటికి రూ.1.10 లక్షలు బాకీ పడ్డారు.
– పోలవరం ప్రాజెక్టు మనందరికి వరం లాంటిది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మనకు నీళ్లు వస్తాయి. నాలుగున్నరేళ్ల పాలనలో పునాది కూడా దాటడం లేదు. రైతులకు మేలు చేయాల్సిన చంద్రబాబు ఆ ప్రాజెక్టును అవినీతిమయం చేశారు. కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నది ఎవరంటే సాక్షాత్తు కేబినెట్ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు బంధువు సబ్‌కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు.
– కాస్తో..కూస్తో ఉద్యోగాలు వచ్చేది ప్రత్యేక హోదా ఉంటేనే. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. ఆ నాడు ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్లు ఏపీ ప్రజలను చంద్రబాబు వెన్నుపొటు పొడిచారు. ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు కొనుగోలు, కరెంటు కొనుగోలు, విశాఖ బూములు, గుడి బూముల్లో దోపిడీ. ఇవాళ పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా..చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే.
– కరెంటు చార్జీలు, పెట్రోలు ధరలు, ఆర్టీసీ చార్జీల బాదుడే బాదుడు. ఇంటి పన్నులు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడే. చంద్రబాబు హయంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు.
– బెల్టు షాపులు రద్దు చేస్తు మొదటి సంతకం అన్నారు. నాలుగున్నరేళ్ల పాలన తరువాత అడుగుతున్నాను. ప్రతి గ్రామంలో తాగడానికి మినరల్ ప్లాంట్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ, బడి పక్కన, గుడి పక్కన బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. మామూలు స్కూల్‌లో కూడా ఏడాది రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను చంద్రబాబు దగ్గరుండి రేషనలైజేషన్ పేరుతో మూసివేయిస్తున్నారు. ఖాళీ టీచర్ పోస్టులను కావాలనే భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో సరిగా చదువు చెప్పడం లేదని అనిపించేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఐదు నెలలుగా సరుకుల బిల్లులు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వడం లేదు. భోజనం సరిగ్గా పెట్టలేని స్థితిలో అక్క చెల్లెమ్మలు ఉన్నారు. మన పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తే చదువులు రావని తల్లిదండ్రుల్లో భ్రమలు కల్పించి నారాయణ, చైతన్య స్కూళ్లలో చేరేలా చేస్తున్నారు. ఆ స్కూళ్లలో ఏడాదికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. స్కూళ్లకు వెళ్తే ఫీజులు షాక్ కొడుతున్నాయి. ఇంజినీరింగ్, డాక్టర్లు చదివించే స్థితిలో ఉన్నామా ఆలోచించండి. ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. అది కూడా ఏడాదిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదని చెబుతున్నారు. ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివించాల్సిన దుస్థితి నెలకొంది.
– ఇవాళ రేషన్ షాపుకు వెళ్తే బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. గతంలో రేషన్‌షాపుల్లో బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, గొదమపిండి, పామాయిల్, ఉప్పు, కారం, కిరోసిన్ ఇచ్చేవారు. ఇవాళ ఇవేవి కూడా అందడం లేదు. బియ్యంలో కూడా కోత విధిస్తున్నారు. వేలి ముద్రలు పడటం లేదని కటింగ్ పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు హయాంలో ఎక్కడా కూడా పాలన లేదు. మోసాలు, అబద్ధాలు, అవినీతి అన్న పాలన సాగుతోంది.
– ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఈ మధ్య కాలంలో శ్రీకాకుళంలో తిత్లీ తుపాను 11 రోజుల క్రితం వచ్చింది. ఏదాంట్లో కూడా రాజకీయ లబ్ధి ఎలా పొందాలన్నదే ఆయన తపన. తిత్లీ తుపాన్ వచ్చిన సమయంలో చంద్రబాబు శ్రీకాకుళం వెళ్లారు. ïతుపాను రాబోతుందని వారం రోజుల క్రితం టీవీల్లో చెప్పారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రత్యామ్నయ చర్యలు ఏర్పాటు చేయాలి. చంద్రబాబుకు ఇవేవి కూడా పట్టవు. తుపాను వచ్చిన తరువాత తీరికగా శ్రీకాకుళం వెళ్లారు. ఏ మాత్రం సహాయం చేయని పరిస్థితి చూసి అక్కడి ప్రజలు చంద్రబాబును గట్టిగా నిలదీస్తే..బొల్డోజర్స్‌తో తొక్కిస్తానని హెచ్చరిస్తారు. ఒక్కసారి చంద్రబాబు మాట్లాడిన మాటలు గమనించండి. శ్రీకాకుళం జిల్లాలో ఏం జరుగుతోందో అని చెప్పడానికి ఈయన సముద్రాన్ని కంట్రోల్ చేస్తారట. హూద్‌హుద్ తుపానును జయించానని సంబరాలు చేసుకున్నారు. మోసం చేయడం కోసం అనంతపురంలో రెయిన్ గన్లతో కరువును పారద్రోలానని చెప్పారు. అయ్యా..చంద్రబాబు గతంలో హుద్‌హుద్ తుపానులో రూ.65 వేల కోట్ల నష్టం వచ్చిందని నీవే చెప్పావు. నాలుగున్నరేళ్ల పాలన అయిపోయిన తరువాత అడుగుతున్నాను..ఎంత ఖర్చు చేశావని అడుతున్నాను. హుద్‌హుద్ తుపానుకు రూ.926 కోట్లు ఖర్చు చేశారట. సాక్షాత్తు చంద్రబాబే హోమంత్రికి చెప్పారు. ఇందులో కేంద్రం రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 400 కోట్లేనా? ప్రచారం మాత్రం హుద్ హుద్ తుపానును జయించానని చెప్పారు. తిత్లీ తుపాను వచ్చింది..రూ.3435 వేల కోట్ల నష్టం వచ్చిందని చెబుతున్నారు. మీరు చేసింది ఏమీ చంద్రబాబు అని అడుగుతున్నాను. అక్కడి ప్రజలకు కేవలం రూ.200 సరుకులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అక్కడి ప్రజలు నీటి కోసం నిలదీస్తే..వెనుకలా నుంచి ఫోటోలు తీసి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఎల్లోమీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. అమరావతిలో హోర్డింగ్‌లు పెట్టుకుంటున్న దిక్కుమాలిన సీఎం ఎక్కడ ఉండడు.
– ఈ పెద్ద మనిషి పాలన చూశారు. జగన్ శ్రీకాకుళం ఎందుకు వెళ్లలేదని అంటున్నారు. నిజంగా నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు..సీఎం నువ్వా..నేనా అని అడుగుతున్నాను. ఖజానా నీ వద్ద ఉందా? నావద్ద ఉందా? అధికార యంత్రాంగం నీ వద్ద ఉందా ? నా వద్ద ఉందా? నేను పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి మా పార్టీ సీనియర్ నాయకులు బాధితుల తరఫున నిలబడితే చంద్రబాబు ఏమంటారో తెలుసా..ప్రతిపక్షం సహాయ కార్యక్రమాలు అడ్డుకుంటుందని బురద వేస్తారు. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదని అంటారు. చంద్రబాబు గారు ..ఏమి చేసినా నిజయితీగా చేసే చిత్తశుద్ధి మాకుంది. ఇవాళ్టికి 11 రోజులు అవుతుంది. మరో వారం రోజుల్లో తుపాను బాధిత ప్రాంతానికి వెళ్తాను. 50 రోజుల పాటు అక్కడే ఉంటాను. నీవు చెప్పిన రూ.3435 కోట్లు బాధితులకు అందజేయకపోతే వారందరికీ భరోసా ఇస్తున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మొత్తం మన ప్రభుత్వం ఇస్తుంది.
– పింఛన్లు పెంచడంలో చంద్రబాబు మనసు రాదు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా జగన్ రెండు అడుగులు వేస్తాను. పింఛన్ వెయ్యి నుంచి రూ.2 వేలు పెంచుతాను. ఇందులో ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే ఎవరైనా రావచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని మీ అందరిని కోరుతున్నాను.