గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్‌ చేస్తాం


తూర్పు గోదావరి: గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో బుధవారం వైయస్‌ జగన్‌ను ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్‌ కలిశారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ కాక కష్టపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే మాకు ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమను చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోవడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ..వైయస్‌ఆర్‌సీపీ అ«ధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీ వర్కర్లను రెగ్యులర్‌ చేస్తామని మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీపై గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్‌ హర్షం వ్యక్తం చేశారు. తామంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామని మద్దతు తెలిపారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటామని వారు నినదించారు. 
 
Back to Top