<br/><br/><strong>చేనేతలు, గీత కార్మికులు,మత్స్యకారులకు జననేత భరోసా..</strong>విజయనగరంః జననేత జగనే మా ఆశా దీపమంటూ చేనేతలు,గీత కార్మికులు, మత్స్యకారులు వైయస్ జగన్‌కు తమ సమస్యలు మొరపెట్టుకుని వినతి పత్రాలు అందజేశారు.టీడీపీ అరాచక పాలనలో అష్టకష్టాలు పడుతున్నామన్నా..మా కోసం నువ్వు రావాలన్నా.. మళ్లీ నాన్నగారి పాలనను చూడాలన్నా అని రాజన్న బిడ్డను కలిసిన సంతోషంలో చెమ్మగిల్లిన కన్నులతో జననేతను అభ్యర్థించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వారి సమస్యలను సావధానంగా వింటూ మన పార్టీ అధికారంలోకి వస్తుందని, కష్టజీవుల కష్టాలను తీరుస్తానని కొండంత భరోసా ఇచ్చారు. ఉపాధి అవకాశాలు లేక వలసపోతున్నామని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతల శ్రమ,కష్టాలన్ని తెలుసుకునేందుకు జననేత రాట్నం తిప్పి..కండెలు పట్టారు. 250 యూనిట్ల విద్యుత్‌ను ఇవ్వమని చేనేతలు వైయస్ జగన్‌ను కోరారు. చేనేతల సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ సమస్యలన్నీ పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు కొటగండ్రేడు గ్రామానికి చెందిన గీత కార్మికులు తమ సమస్యలు అభ్యర్థించారు. గీత కార్మికులకు అంత్యోదయ పథకం కింద 35 కేజీల బియ్యాన్ని పంపిణీ చేయాలని కోరారు. 40 సంవత్సరాల వయస్సు గలవారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. 16 సంవత్సరాలు దాటిన కార్మికులకు గుర్తింపుకార్డులు ఇప్పించాలని కోరారు. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గృహాలను మంజూరు చేయాలని కోటగండేడ్రు గ్రామానికి చెందిన మత్స్యకారులు మొరపెట్టుకున్నారు. ఆరోగ్య బీమా వర్తింపచేయాలని, అంత్యోదయ పథకం కింద 35 కేజీల బియ్యం అందజేయాలని కోరారు. మత్స్యకారులకు 150 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇప్పించాలని కోరారు.