ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @1600 కిలోమీట‌ర్లు

- విజ‌య‌వంతంగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- ప‌లుదేవ‌ర్ల‌పాడు వ‌ద్ద మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌
- జ‌న‌నేత‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం
- దారిపొడ‌వునా విన‌తుల వెల్లువ‌
గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 1,600 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది. మొత్తం మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ లక్ష్యంతో చేపట్టిన ఈ పాదయాత్రలో వైయ‌స్‌ జగన్ ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్ర‌వేశించారు. ప్ర‌స్తుతం స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌వ‌క‌ర్గంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగుతోంది. ప‌లుదేవ‌ర్ల‌పాడు గ్రామం వ‌ద్ద‌ 1600 కిలోమీట‌ర్లు పూర్తి అయిన సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ రాగి మొక్క‌ను నాటారు.  అనంత‌రం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ వీధుల్లో రంగు రంగుల ముగ్గులు వేసి జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.

దారుల‌న్నీ జ‌న‌సంద్రం 
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది.  మండుటెండలు చిన్నబోతున్నాయి.. ప్రజా సంకల్ప యాత్రలో జననేత వైయ‌స్ జగన్‌ దీక్ష చూసి. మైలురాళ్లు పక్కకు తప్పుకొంటున్నాయి.. లక్ష్యం దిశగా సాగుతున్న ఆయన అడుగులకు తలొగ్గి. ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది.. జనసంక్షేమమే లక్ష్యంగా అలుపెరగని పయనం సాగిస్తున్న అభిమాన నాయకుడి ఆశయాన్ని చూసి. అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ జనసైన్యం ఉప్పెనలా అనుసరించి ముందుకు సాగుతోంది.  సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల శివారు నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి నార్నేపాడు క్రాస్‌, తంబళ్లపాడు క్రాస్‌, మాదాల, ఇరుకుపాలెం చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రగా సత్తెనపల్లి చేరుకుంటారు. సాయంత్రం స‌త్త‌న‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు. పాద‌యాత్ర‌ దారులన్నీ జనంతో నిండిపోతున్నాయి.  రోడ్డుకు రెండువైపులా బారులుతీరి జననేత వైయ‌స్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.  మహిళలు మంగళహారతులు పడుతూ, పూలవర్షం కురిపిస్తూ అడుగడుగునా అభిమానం చాటుతున్నారు.  దారిపొడవునా సీఎం.. సీఎం అంటూ యువత కదం తొక్కుతోంది.   ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ వైయ‌స్‌ జగన్ ముందుకు సాగుతున్నారు. 
--------------------

Back to Top