రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర పండుగ

– ప్రజా సంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు
– వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల ప్రత్యేక పూజలు, పాదయాత్రలు
విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఇవాళ 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జననేతకు అయురారోగ్యాలు కలుగాలని, పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లాలో తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి  ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి 3 వేల టెంకాయలను కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో పైడిపాలెం జలాశయం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం నిర్వహించారు. మూడు రోజుల పాటు వీరు పులివెందుల వరకు పాదయాత్ర కొనసాగుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. 
Back to Top