పాదయాత్రకు చురుగ్గా ఏర్పాట్లు

పులివెందుల/వేంపల్లె: పాదయాత్రకు ఏర్పాట్లు చురుగ్గు సాగుతున్నాయి. వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వచ్చే నెలలో చేపటనున్న పాదయాత్ర కోసం వైయస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభాస్థలితో పాటు బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌ తదితర పనులను జగన్‌ రాజకీయ కార్శదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్సార్‌ జిల్లా సమన్వయకర్త వైయస్‌ వివేకానందరెడ్డి, ఎంపీ వైయస్‌ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్‌ బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వైయస్సార్‌ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, మేయర్‌ సురేశ్‌బాబు, జమ్మలమడుగు, బద్వేలు సమన్వయకర్తలు సుధీర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. అంతకుముందు వైయస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డికి వారు నివాళులర్పించారు.

Back to Top