హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. వైయస్సార్సీపీ సింబల్ పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడంపై వైయస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని వైయస్ జగన్ అన్నారు. <br/>