హైదరాబాద్) కరువు, తాగునీటి ఎద్దడి వంటి సమస్యల మీద ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ధర్నాకు దిగుతోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నా లో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్లారు. నేరుగా మాచర్లకు ఆయన వెళుతున్నారు. అక్కడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాలో పాల్గొంటున్నారు. ఇందులో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.