హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారల మండలి సభ్యుడు డీఏఈ సోమయాజులు మృతిపట్ల పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమయాజులు మృత్యువార్త విన్న వైయస్ జగన్ పాదయాత్ర, బహిరంగసభను రద్దు చేసుకొని హుటాహుటిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మెహదీపట్నంలోని ఆయన నివాసంలో భౌతికకాయానికి వైయస్ జగన్, వైయస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నివాళులర్పించారు. సోమయాజులు కుటుంబసభ్యులను ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, రాజీనామా చేసిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆర్కే, రఘురామిరెడ్డి, అధికార ప్రతినిధిలులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, పద్మజ తదితరులు ఉన్నారు.