వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం

రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తన బస్సు యాత్రను బుధవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్, అక్కడి నుంచి నేరుగా ధవళేశ్వరం బ్యారేజి వద్దకు వెళ్లారు.

ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఆయన సర్ ఆర్థర్ కాటన్, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి పట్టిసీమ ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు.

ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.

తాజా వీడియోలు

Back to Top