అధికార పార్టీ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంమహిళా ఎమ్మెల్యేను రూల్స్ కు విరుద్ధంగా సస్పెండ్ చేశారు
ఇసుక మాఫియాకు అడ్డొస్తుందని ఎమ్మార్వో వనజాక్షిని కొట్టారుఅంగన్ వాడీ అక్క, చెల్లెమ్మలను దుర్భషలాడారు, ఈడ్చేశారుఅధికారపార్టీ కామాంధులకు విద్యార్థిని బలైపోయిందికాల్ మనీ సెక్స్ రాకెట్ లో మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపారుఐనా టీడీపీ ఎమ్మెల్యేలపై కేసులు లేపు, అరెస్ట్ లు లేవుటీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్
అసెంబ్లీః మహిళా దినోత్సవం రోజు కూడా చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నాడని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలోమహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. స్త్రీలను సరిగా చూసుకుంటున్నామా లేదా అన్నది గుండెల మీద చేయివేసుకొని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను రూల్స్ కు విరుద్ధంగా సంవత్సరం పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని వైఎస్ జగన్ ప్రభుత్వ తప్పును ఎత్తిచూపారు. చట్టసభలో చేసిన చట్టాన్నికూడా ఉల్లంఘిస్తూ, మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘనచరిత్ర ఏపీ శాసనసభకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
ఎమ్మార్వో వనజాక్షి ఇసుకమాఫియాకు అడ్డు తగులుతుందని టీడీపీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ జట్టుపట్టుకొని కొట్టాడు. ఐనా అతనిపై కేసు లేదు. అరెస్ట్ లు లేవని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాసనసభకు సంబంధించిన ఇదే శాసనసభ్యుడు అంగన్ వాడీ అక్కచెల్లెమ్మలను దుర్భషలాడాడు. ఆశాసనసభ్యుడికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే కేసు ఫైల్ చేయలేదు. అరెస్ట్ చేయలేదని ఫైరయ్యారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ లో చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని.. అధికారపార్టీకి చెందిన కామాంధుల అరాచకానికి బలైతే, ఆ ప్రిన్సిపల్ పై ఎలాంటి చర్యలు లేవని వైఎస్ జగన్ మండిపడ్డారు. అరెస్ట్ లు చేసినంత స్పీడ్ గా బెయిల్ మీద పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర రాజధాని విజయవాడలో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ...వడ్డీ వ్యాపారం పేరున అధిక వడ్డీలకు డబ్బులిచ్చి, అవి కట్టలేని పరిస్థితుల్లో అక్క, చెల్లెమ్మలను సెక్స్ రాకెట్ చేసి వీడియో రికార్డింగ్ తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఐజీతో దిగిన ఫోటోలున్నాయి. అన్ని సాక్ష్యాలున్నా జైళ్లకు ఎవరినీ పంపరు. కోర్టు దాకా వెళ్లాల్సిన పనిలేకుండా.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఇవన్నీ ఒక్క ఏపీలోనే జరుగుతున్నాయని, అక్కచెల్లెమ్మల పట్ల ప్రభుత్వం ఏవిధమైన ప్రేమ చూపిస్తుందో అర్థమవుతోందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభలో, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అక్క, చెల్లెమ్మలకు వైఎస్ జగన్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. 1977లో యువెన్ ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో తీర్మానం చేసి... ప్రపంచమంతా మహిళలకు సమాన హక్కులు రావాలన్న ఉద్దేశ్యంతో దాన్ని కొనసాగింపజేశారని వైఎస్ జగన్ తెలిపారు. అలా ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో వస్తారని, ఈంసవత్సరం వారు 'ప్లానెట్ 50:50 బై 2030, స్టెపప్ జెండర్ ఈక్వాలిటీ'. అక్క చెల్లెళ్లకు ఉన్నత స్థానం కోసం పోరాడతాం అనే థీమ్ ఇచ్చారని చెప్పారు. మహిళ ఔన్నత్యమైన స్థానం అని...స్త్రీ అంటే తల్లి . తల్లి అంటే ఓపిక అని వైఎస్ జగన్ పేర్కొన్నారు .