చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌


- జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- దారి పొడ‌వునా బాధ‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
- అంద‌రికీ నేనున్నాన‌ని భ‌రోసా క‌ల్పిస్తున్న రాజ‌న్న బిడ్డ‌
విజ‌య‌న‌గ‌రం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. శనివారం ఉదయం జననేత 279వ రోజు పాదయాత్రను మూల స్టేషన్‌ నుంచి ప్రారంభించ‌గా కొద్ది సేప‌టి క్రితం ఎస్ఎస్ఆర్ పేట వ‌ద్ద‌ చీపురుపల్లి నియోజకవర్గంలోకి ప్ర‌వేశించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.   

దారిపొడవునా ఎన్నో అర్జీలు.. ఇంకెన్నో వేదనలు.. వ్యథాభరిత హృదయ ఘోష. చంద్రబాబు రాక్షస పాలనలో నలిగిపోయిన, నలిగిపోతున్న వాళ్లే. వాళ్లంతా జగన్‌ రావాలని, వస్తేనే కష్టాలు తీరతాయని భావించారు.  వైయ‌స్ఆర్‌సీపీ అభిమాని అనే సాకుతో సంక్షేమ పథకాలు ఇవ్వమంటున్నారని స్థానికులు వైయ‌స్‌ జగన్‌ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుద్‌హుద్‌ తుపానుతో ఇళ్లు నేలమట్టమైతే ఈవాళ్టికీ ఈ సర్కారు ఆదుకోలేందంటూ దారిపొడవునా పేదలు చంద్రబాబు పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారు. 

‘అన్నా.. మీరొచ్చి ఆదుకోవాలి’.. 
దారి పొడ‌వునా ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. ఈ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నా..మీరొచ్చి ఆదుకోవాల‌ని వేడుకుంటున్నారు.   బాబు పాలనలో ఏ ఒక్క నోటిఫికేషన్‌ రాలేదని, చదవుకున్న యువత ఉపాధి లేక అలమటిస్తోందని చెప్పారు. ‘మీరు ప్రకటిస్తున్న నవరత్నాలు విన్నాక భవిష్యత్‌పై ఆశ కలుగుతోందన్నా.. ఎస్టీల బతుకులు మారతాయన్న నమ్మకం కలిగిందన్నా..’ అంటున్నారు.   

దారి పొడ‌వునా తోర‌ణాలు
త‌మ అభిమాన నేత వ‌స్తుండ‌టంతో దారి పొడ‌వునా పార్టీ తోర‌ణాలు, ఫ్లెక్సీల‌తో అందంగా అలంరించారు. మ‌హిళ‌లు ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతూ బొట్టు పెట్టి ఆశీర్వ‌దిస్తున్నారు. దారిపొడవునా ప్రతి ఒక్కరినీ కలుస్తున్న జగన్‌కు ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో వాళ్లే స్వచ్ఛందంగా క్యూ కట్టారు. ప్రతి ఇంటి ముందూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ జెండా.. గుమ్మం ముందు ఎవరో ఒకరు నవ్వుతూ ‘అన్నా...’ అంటూ పిలిచే పిలుపులు.. వేచి చూస్తున్న గుంపులో ‘ఆయనొస్తాడు... మళ్లీ వాళ్ల నాన్న పాలనే వస్తుంది’ అనే చర్చ విన్పించింది. జననేతను కలిసి ప్రతి గుండె పులకించింది. సెల్ఫీ దిగితే దాన్నో అరుదైన అవకాశమొచ్చిందని ఉప్పొంగి పోవడం దారిపొడవునా కన్పించింది. జననేత వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైయ‌స్‌ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top