శుభాభినందనలు..!

హైదరాబాద్) పీఎస్ఎల్వీ సీ 32 ప్రయోగం విజయవంతం కావటం పట్ల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హర్షం ప్రకటించారు. ఈ ఉపగ్రహ ప్రయోగం అంతరిక్ష ప్రయోగాల పరంపరలో విశిష్టమైనది. ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఎఫ్ ఉపగ్రహాన్ని తీసుకొని ఈ వాహక నౌక ప్రయాణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో సొంతంగా నావిగేషన్ సిస్టమ్ ఉన్న అగ్ర దేశాల సరసన భారత్ చేరినట్లయిందని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. ఇంతటి విజయాన్ని సాధించిపెట్టిన అంతరిక్ష శాస్త్రవేత్తలకు వైెఎస్ జగన్ అభినందనలు తెలిపారు. 
Back to Top