హైదరాబాద్) ప్రముఖ పాత్రికేయుడు, రచయిత యాదాటి కాశీపతి మృతి మీడియాకు తీరని లోటని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. యాదాటి కాశీపతి మంచి వక్త, చక్కటి రచయిత, విలువలు కలిగిన పాత్రికేయుడని పేర్కొన్నారు. ఆయన రచించిన రచనలు ప్రజలను ఎంతో చైతన్యపర్చేవిధంగా ఉన్నాయని వైయస్ జగన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాశీపతి కుటుంబానికి వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.