వైయస్ జగన్ సంతాపం

ఉపాధి లేక పొట్టకూటి కోసం హైదరాబాద్ కు
భవనం కుప్పకూలిన ఘటనలో పలువురి మృతి
ఘటనాస్థలాన్ని పరిశీలించిన బొత్స, గట్టు
మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్ః నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై  వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర కలత చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

వైయస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తదితరులు నానక్ రాంగూడ ఘటనాస్థలిని పరామర్శించారు. భవనం కుప్పకూలిన ఘటనపై మరణించిన కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్నికోరారు. ఉపాధి లేక పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చారని, ఏపీ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

సహాయ సిబ్బంది మరో మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. అంతకుముందు బయటకు తీసిన నలుగురి మృతదేహాలు శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరివిగా గుర్తించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Back to Top