ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 1500 కిలోమీట‌ర్లు
- విజ‌య‌వంతంగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- గుంటూరు జిల్లాలో బ్ర‌హ్మ‌ర‌థం
- బాధ‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు

గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో మైలు రాయిని అధిగ‌మించింది. బుధ‌వారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ముదుకులూరు వ‌ద్ద‌ 1500 కిలోమీటర్లు మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా  సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం  వైయ‌స్‌ జగన్‌ ములుకుదురులో మొక్కను నాటారు.

వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’  వైయ‌స్ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తై ఈ నెల 12న గుంటూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌వేశించింది.  180 రోజులపాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కి.మీల మేర వైఎస్ జగన్ పాదయాత్ర సాగనుంది. ఏ గ్రామానికి వెళ్లిన జ‌నం జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. దారిపొడ‌వునా త‌మ‌స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. రైతులు, విద్యార్థులు, వికలాంగులు, నిరుపేదలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ అభిమాన నేతకు కన్నీటి పర్యంతరమవుతూ విన్నవించారు. పార్టీ శ్రేణులు సైతం టీడీపీ నాయకుల నుంచి తామెదుర్కొంటున్న ఇబ్బందులు ఏకరువుపెడుతున్నారు. అంద‌రికి భ‌రోసా క‌ల్పిస్తూ..న‌వ‌ర‌త్నాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నారు.

కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు

0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ ‌24, 2017)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1400​‍ - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018) 

తాజా ఫోటోలు

Back to Top