కర్నూలులోని బనకచర్ల హెడ్ రెగ్యులరేటర్ను పరిశీలించిన వైఎస్ జగన్

కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం కర్నూలు జిల్లా బనకచర్ల డైవర్సన్ స్కీమ్ హెడ్ రెగ్యులరేటర్ పనులను పరిశీలించింది. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు.

పోతిరెడ్డిపాడు నుంచి బానుకచర్లకు 44 వేల క్యూసెక్కుల నీరు రావాల్సివుండగా, 3 నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ రోజు ఉదయం దోర్నాల నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్ మాల్యాలలో హంద్రీ-నీవా ప్రాజెక్టును సందర్శించిన అనంతరం రైతులతో మాట్లాడనున్నారు.
Back to Top